మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తక్కువ స్కోరుకే అవుట్ అయింది. 32 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 23 రన్స్ మాత్రమే చేసింది. నోన్కులులేకో మ్లాబా బౌలింగ్‌లో సునే లూస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన చేసింది 23 పరుగులే అయినా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
మహిళల వన్డే క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌ల్లో 982 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ బెలిండా క్లార్క్ రికార్డును బ్రేక్ చేసింది. 1997లో బెలిండా 14 ఇన్నింగ్స్‌ల్లో 970 రన్స్ చేసింది. ఈ జాబితాలో లారా వోల్వార్డ్ట్ (882), డెబ్బీ హాక్లీ (880), అమీ సాటర్త్‌వైట్ (853)లు ఉన్నారు. మంధాన మరో 18 పరుగులు చేస్తే.. ఒకే ఏడాదిలో 1000 రన్స్ చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా నిలుస్తుంది.
Also Read: Actress Ramya: నటికి అసభ్యకర మెసేజ్‌లు.. 12 మందిపై చార్జిషీట్ దాఖలు! ప్రధాన నిందితుడు సూపర్ స్టార్
ఇక మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. 37 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రిచా ఘోష్ (32), అమంజోత్ కౌర్ (8)లు క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ప్రతీకా రావల్ (37) మినహా మిగతా వారు విఫలమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ అయింది. హర్లీన్ డియోల్ (13), హర్మన్ ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (4)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ప్రొటీస్ బౌలర్ నాన్కులులేకో మ్లాబా 2 వికెట్స్ పడగొట్టారు.
