మహిళలకు కర్ణాటక ప్రభుత్వం దీపావళి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నెలలో ఒకరోజు రుతుక్రమ సెలవును ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వర్తిస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ, బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Train: టికెట్ లేకుండా పట్టుబడ్డ ఉపాధ్యాయురాలు.. టీసీ వేధిస్తున్నాడంటూ రివర్స్‌లో వాగ్వాదం
మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే తమ ఉద్దేశం అని తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ విధానాన్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని.. అందుకే ఇక్కడా కూడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నామని హెచ్‌కే పాటిల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది
ప్రస్తుతం బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం వంటి రాష్ట్రాలు వేతనంతో కూడిన రుతు సెలవులను అమలు చేస్తున్నాయి. ఏ ప్రైవేట్ రంగ సంస్థ అయినా దీనిని అమలు చేయాల్సిందే. జొమాటో, స్విగ్గీ, లార్సెన్, టూబ్రో (ఎల్ అండ్ టి), బైజూస్, గోజూప్ వంటి సంస్థలు వేతనంతో కూడిన రుతు సెలవులను ప్రకటించాయి.
