బాబోయ్ చైనాలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైళ్ల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. 36 లైన్లు కలిగిన చైనాలోని వుజువాంగ్ టోల్ స్టేషన్ దగ్గర కార్లు క్యూ కట్టాయి. వేలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. ఎర్రటి లైట్లు కలిగిన వాహనాలు ప్రకాశవంతంగా వెలుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi-Keir Starmer: బీచ్ ఒడ్డున మోడీ-స్టార్మర్ ముచ్చట్లు.. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు
జాతీయ దినోత్సవం, మిడ్-ఆటం ఫెస్టివల్ సెలవులను ముగించుకుని తిరుగు ప్రయాణం పట్టారు. దీంతో చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లోని అతిపెద్ద టోల్ స్టేషన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్టోబర్ 6న సోమవారం లక్షలాది మంది ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వుజువాంగ్ టోల్ స్టేషన్ దగ్గర వాహనాలు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Karnataka: మహిళలకు దీపావళి గుడ్‌న్యూస్.. నెలసరి సెలవు ప్రకటించిన ప్రభుత్వం
టోల్ గేట్ దగ్గర దాదాపు 1,20,000 కంటే ఎక్కువ వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఆగిపోయాయి. నెమ్మది నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. డ్రైవర్లంతా న్యూ ఇయర్ రద్దీని గుర్తుచేసుకుంటున్నారు. డ్రోన్ ఫుటేజ్‌లో అనేక వాహనాలు టోల్ గేట్ల గుండా వెళ్ళడానికి బహుళ లేన్లలో కదులుతున్నట్లు కనిపించింది.
చైనాలో కుటుంబ సమావేశాలకు మిడ్-ఆటం పండుగ ముఖ్యమైనది. ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ సెలవుదినం కూడా ఒకే సమయంలో వచ్చింది. దీని ఫలితంగా అక్టోబర్ 1 నుంచి 8 వరకు సాధారణ రద్దీ కంటే ఎక్కువగా వచ్చింది. ఈ సంవత్సరం సెలవు దినాలలో దాదాపు 888 మిలియన్ల ట్రిప్పులు జరిగాయని, గత సంవత్సరం ఏడు రోజుల సెలవు దినాల్లో 765 మిలియన్ల ట్రిప్పులు జరిగాయని సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
చైనాలో ఇలాంటి భారీ ట్రాఫిక్ జామ్‌లు గతంలో కూడా నమోదయ్యాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 2010లో 12 రోజుల ట్రాఫిక్ జామ్ ఉంది. ఆగస్టు 14, 2010న బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేపై 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా జనజీవనం స్తంభించి పోయింది. ట్రక్కులు చెడిపోవడంతో వేలాది వాహనాలు, ప్రయాణికులు 12 రోజులు హైవేపైనే చిక్కుకుపోయి నానా యాతన పడ్డారు.
In China, traffic caused by people returning home after the holiday was captured.
pic.twitter.com/VmwQmKDS3S
— Tansu Yegen (@TansuYegen) October 9, 2025
