మునగాకు ఈ ఆకులో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మునగ చెట్టులోని ప్రతీ భాగం తినొచ్చు. దీంతో ఎన్నో లాబాలు అందుతాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగాకుల్ని ఎండబెట్టి పొడిలా చేసి తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి.
Read Also:HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో అందరిపై హెచ్ఐవీ రక్తం
మునగాకుల్లో కాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు ఎన్నో ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం, పిండం పెరుగుదలని కావాల్సిన విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్య గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. మలేరియా, టైఫాయిడ్ జ్వరం నుండి రక్తపోటు, షుగర్ వరకూ అనేక సమస్యలకి నివారణగా ఈ పొడిని వాడతారు. ముగన పొడిని ఎన్నో విధాలుగా ఔషధంగా వాడతారు. దీనిని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు, షుగర్, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
మునగపొడిలో ప్రోటీన్స్, ఖనిజాలు, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. మునగ పొడిని తీసుకోవడం వల్ల లివర్, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తగ్గడమే కాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి.మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఆహారాన్ని జీర్ణం చేయడం, స్మోకింగ్, రేడియేషన్ కారణంగా ఉత్పత్తి అవుతాయి. మునగాకుపొడిలో ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మునగాకు బాగా పనిచేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా మారుతుంది. లివర్ని కాపాడడంలో మునగాకు ముందుంటుంది. దీనిని తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగ్గా మారుతుంది. అంతేకాదు, జీర్ణ సమస్యలైన అజీర్ణం, మలబద్ధకం కూడా తగ్గుతుంది.
Read Also:Wins 53 Lakh Car: లక్కీ మేధాంశ్… రూ. 201 కూపన్ తో ఏకంగా.. టయోటా ఫార్ట్యూనర్ కారు
ప్రపంచమంతటా డయాబెటిస్ అనే సమస్య పెరుగుతూనే ఉంది. మానవులపై జరిగిన అధ్యయనాల్లో మునగ పొడి డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువగా తగ్గించింది. మునగపొడిలో ఎక్కువగా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఇతర ముఖ్య బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, క్యాన్సర్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మునగాకుతో ఎంతో ఆరోగ్యం. కానీ..కొన్ని పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు ఈ ప్రయోజనాలు ఇంకాస్త పెరుగుతాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్ మంజూ మాలిక్. అంతే కాదు. కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదని వివరించారు.
మునగాకుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా పని చేస్తుంది. అంతే కాదు. ఇందులో క్యాల్షియం సహా మరి కొన్ని మినరల్స్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. అందుకే..రోజూ ఏదో ఓ రూపంలో మునగాకుని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మంది మునగాకుని పొడి చేసుకుని తింటారు. ఇంకొందరు కూర చేసుకుంటారు. అయితే..ఎలా తింటే సరైన విధంగా అందులో ఉన్న పోషకాలు అందుతాయన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని వివరించారు హెల్త్ ఎక్స్ పర్ట్ మంజూ మాలిక్. మునగాకుని సరిగ్గా వాడాల్సిన పద్ధతుల గురించి ఆమె ఎక్స్ ప్లెయిన్ చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
Read Also:RBI: ఇకపై స్మార్ట్ వాచ్, సన్ గ్లాసెస్ తో యూపీఐ పేమెంట్స్
మునగాకుని నేరుగా తీసుకున్నా ప్రయోజనాలుంటాయి. అయితే.. వాటిని మరి కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే అవి రెట్టింపు అవుతాయి. హెల్త్ ఎక్స్ పర్ట్ మంజూ మాలిక్ చెప్పిన విషయం కూడా ఇదే. మునగాకులో ఉన్న పోషకాలన్నీ శరీరానికి సరైన విధంగా అందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో మొట్టమొదటి చిట్కా ఏంటంటే..విటమిన్ సి అధికంగా ఉన్న పదార్థాలతో కలిపి మునగాకు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత ఎక్కువ అందుతాయి. అంటే నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ లేదా కివీ పండ్లతో కలిపి తీసుకుంటే మంచిది. మునగాకు పొడి చేసుకున్నప్పుడు అందులో కాస్తంత నిమ్మరసం కలుపుకుని తింటే మంచిది. అదే విధంగా ఉసిరికాయ రసం కలుపుకున్నా మంచిదే.
