కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇటీవల ఆయన 100వ సినిమాని సైలెంట్‌గా ప్రారంభించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి కథతో, ఎలాంటి రోల్‌లో కనిపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయగా.
ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ హీరోయిన్ టబూ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. నాగార్జున–టబూ జంట గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ అనే రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి, ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ తెచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’ కూడా మంచి స్పందన అందుకుంది.
ఆ తర్వాత ఈ జోడీ మరోసారి స్క్రీన్‌పై కలవలేదు. దీంతో ఇప్పుడు నాగ్ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత గల 100వ సినిమాలో టబూ కనిపించబోతుందనే వార్తతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే, ఈ వార్త పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. నిజంగా టబూ ఈ సినిమాలో నటిస్తే, నాగార్జున కెరీర్‌లో ఇది ఒక ఎవర్‌గ్రీన్ రీయూనియన్‌గా నిలిచిపోనుంది.
