Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం

Ai generated article, credit to orginal website, October 10, 2025

కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
పార్టీ మార్పు అనేది దుష్ప్రచారమే: పొన్నాల

జనగామ చౌరస్తా, అక్టోబర్‌ 9 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తంచేశారు. గురువారం జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 22 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదని తెలిపారు. ఇది ప్రజల్లో వస్తున్న మా ర్పును చూసి వాస్తవాలకు అనుగుణంగా చెబుతున్న మాటే కానీ రాజకీయ దురుద్దేశంతో అంటున్నది కాదని స్పష్టం చేశారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు బీఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పడతారని చెప్పా రు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, దివంగత ఎమ్మె ల్యే మాగంటి గోపినాథ్‌పై ఉన్న సానుభూతి, గత బీఆర్‌ఎస్‌ అభివృద్ధి అంశాలు కలిసి జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని పొన్నాల పేర్కొన్నారు.
నేను పార్టీ మారడం లేదు..
తాను పార్టీ మారుతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారం కోసం, ప్రతిష్ఠ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు తాను ఎ లాంటి షరతులు విధించలేదని చెప్పారు. పొన్నాల ఎప్పటికీ పులేనని అవసరమైనప్పుడే గర్జిస్తానని ఘాటుగా స్పందించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తుది పోరుకు స‌న్న‌ద్దం భార‌త్ సిద్దం
  • మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు
  • గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్
  • హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
  • హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes