గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది. పాలన పూర్తిగా అంతర్గత విషయం అని శుక్రవారం హమాస్, పాలస్తీనా వర్గాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఇది కూడా చదవండి: Krishna District SP: పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకుంటాం !
ఈ మేరకు విదేశీ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థలు స్పష్టం చేశాయి. గాజా పునర్నిర్మాణంలో అరబ్-అంతర్జాతీయ భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని.. అంతేకాని పెత్తనాన్ని అంగీకరించబోమని తెలిపాయి. ప్రస్తుతం గాజాలో పాలనపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమవుతోంది. చర్చల్లో జాతీయ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను గౌరవించాలని పాలస్తీనా వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Vijayalakshmi Murder: నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
ట్రంప్ 20 పాయింట్ల శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయం అంగీకరించాయి. ఈజిప్టు వేదికగా చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు సానుకూలంగా జరిగినట్లు సమాచారం. బందీలను ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇలా మొత్తానికి గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి పునాదులు పడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
