Kalki 2898 Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898AD’.. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 పార్ట్ 2’ తెరకెక్కబోతుంది. అయితే, కొన్ని సమస్యలతో సీక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తప్పించినట్టుగా చిత్ర యూనిట్ పేర్కొనింది. సీక్వెల్ నుంచి దీపికాని తప్పించడంతో ‘కల్కి 2898 పార్టీ 2’ సినిమాలో ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ‘కల్కి-2’ మూవీపై తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించాల్సిందిగా మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, టాలీవుడ్ వర్క్ కల్చర్, ఆలియాకి బాగా సుపరిచితమే కాబట్టి.. సుమతి రోల్‌కి ఆమె సరిగ్గా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. కాగా, దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరోవైపు, పార్ట్-1లో ‘కల్కి’ని గర్భంలో మోస్తున్న ‘సుమతి’ అనే మహిళ పాత్రలో దీపిక నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారో అనే అంశంపై నెట్టింట భారీ చర్చ కొనసాగుతుంది.
