Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్

Ai generated article, credit to orginal website, October 13, 2025

Ex MLC Kavitha : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కవిత (Ex MLC Kavitha) డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని.. ఇకనైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
Ex MLC Kavitha Petition
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు. ఈ బిల్లుల చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పారు.
అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు  (TG High Court)స్టే విధించిందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలని పేర్కొన్నారు.
అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై యోచిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు (TG High Court) ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించనుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – టీపీసీసీ చీఫ్
తెలంగాణలో (Telangana) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చినందున సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ వెసులు బాటు దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ఆపటంలో అసలైన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
గవర్నర్ దగ్గర బిల్లుని పెండింగ్ లో ఉంచారని… గవర్నర్ ను నియమించేది ఎవరు? అని ప్రశ్నించారు మహేశ్ గౌడ్. మూడు చట్టాలు ఒక ఆర్డినెన్సు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో చేయాల్సిందంతా చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఉదాసీనత వల్ల జీవో ఇచ్చారని దుయ్యబట్టారు.
రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు మహేశ్ గౌడ్. అధికారంలోకి వచ్చాకా కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఫిర్యాదు చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలు అన్ని సర్దుబాటు చేసుకుంటామని వివరించారు. ఆర్ఓబీ నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని.. కేంద్రం నిధులు రాకపోవటం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
హరీష్ పై ఉత్తమ్ ఫైర్
అవాస్తవాలు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెలే, మాజీ మంత్రి టి. హరీశ్ రావుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదంటూ హరీశ్ రావుకు ఆయన హితవు పలికారు. శనివారం హనుమకొండలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్లపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతేకాదు.. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి పార్టీ వ్యతిరేకమని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు.
తెలంగాణ (Telangana) నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రానికి ఇప్పటికే లిఖిత పూర్వక ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే ఆలమట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా కూడా తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నీటి పంపకాల పంచాయతీలో మంత్రి హోదాలో హాజరైన ఏకైక వ్యక్తిని తానేనని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
మీరు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందంటూ హరీశ్ రావుకు చురకలంటించారు. ఈ 22 నెలల్లో కాళేశ్వరం ప్రాజక్ట్ నయాపైసా కూడా పనికి రాలేదన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జలాలను ఆంధ్రకు అప్ప జెప్పారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా నీటిని తాము కాపాడుకుంటామని తెలిపారు. తప్పడు మాటల ద్వారా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ హరీశ్ రావుపై మండిపడ్డారు.
తెలంగాణ (Telangana) నీటి హక్కులను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ కట్టిన ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కూలిపోయిందని వ్యంగ్యంగా అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తుమ్మడిహెట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్త లేదని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరీశ్ రావు మాట్లాడిన మాటలలో వాస్తవాలు ఏమి లేవని.. ఈ తరహా ప్రచారాన్ని మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు
The post Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2
  • Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో
  • Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
  • Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం
  • APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes