పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్నందున అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Shalini Pandey : మేమూ మనుషులమే అంటూ.. దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్
ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ చిత్ర టైటిల్‌పై కొత్త చర్చకు దారితీశాయి. తన రాబోయే డ్యూడ్ మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. “మైత్రీ మూవీ మేకర్స్ వారు నాకు ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా నుంచి కొన్ని సీన్స్ చూపించారు. వారి ప్యాషన్ చూసి నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను” అని చెప్పడంతో, అభిమానులు వెంటనే టైటిల్ ‘ఫౌజీ’ అని అర్థం చేసుకున్నారు. ప్రదీప్ లీక్ చేసిన ఈ కామెంట్ వల్ల ‘ఫౌజీ’ అనే పేరును దాదాపు ఖరారైనట్లే అనుకుంటున్నారు సినీ వర్గాలు. ఈ పేరు ప్రభాస్ పాత్రకు కూడా సరిగ్గా సరిపోతుందని అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆయన ఆర్మీ నేపథ్య పాత్రలో యాక్షన్, ఎమోషన్ మిళితమైన రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హను రాఘవపూడి ప్రత్యేకమైన రొమాంటిక్ టచ్‌తో కథను తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మేజర్ హిట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
