ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు వదిలేసే ప్లేయర్ల గురించి సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి స్టార్ ప్లేయర్స్ ఐదుగురు అవుట్ అంటూ ఓ న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురించి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. వచ్చే మినీ ఆక్షన్ ముందు ఆర్సీబీ ఏడుగురు ఆటగాళ్లను వదిలేయనుందని సమాచారం. ఈ లిస్టులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడం గమనార్హం.
Also Read: Train Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఐదు రోజుల పాటు పలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ రద్దు!
ఆర్సీబీ కోర్ ప్లేయర్లను కూడా వదిలేయనుందని తెలుస్తుంది. లిస్టులో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్, భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్, దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి ఉన్నారటని తెలుస్తోంది. వీరితో పాటు బ్లెస్సింగ్ ముజార్బాని, సుయశ్ శర్మ కూడా ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ఇప్పటికే తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆటగాళ్లను వదిలేయడం ద్వారా రూ.15 కోట్ల వరకు ఆర్సీబీ పర్సులో చేరనున్నాయి. ఈ డబ్బుతో మంచి ఆటగాళ్లను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ 202 మినీ వేలం డిసెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉంది.
