Hyderabad | హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కవల పిల్లలను చంపి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పద్మారావు నగర్ ఫేజ్ 1లో అనిల్ కుమార్- సాయిలక్ష్మీ (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్, కార్తికేయ ఉన్నారు. కాగా కుటుంబ కలహాలతో కలత చెందిన సాయిలక్ష్మీ బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్ చేసుకుంది. కాగా, మృతురాలు సాయిలక్ష్మి స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
