Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌

Ai generated article, credit to orginal website, October 16, 2025

 
 
టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా తమిళనాడు అసెంబ్లీలో చర్చజరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ టీవీకే పార్టీతో పాటు విజయ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాలీకి విజయ్‌ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అసెంబ్లీలో స్టాలిన్‌ మాట్లాడుతూ… కరూర్‌ తొక్కిసలాట ఘటన తమిళనాడు మొత్తాన్ని కలచివేసిందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. టీవీకే షెడ్యూల్‌ తప్పిదాలే ఘటనకు కారణమన్నారు. ర్యాలీకి విజయ్‌ మధ్యాహ్నం వస్తారంటూ పార్టీ పేర్కొనగా.. ఆయన ఏడు గంటల తర్వాత వచ్చారని వెల్లడించారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం గుమిగూడారన్నారు. ప్రచార వాహనం జనంలోకి వెళ్తుండగా.. గందరగోళం నెలకొనడంతో పాటు ఊపిరాడని కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు. విజయ్‌ ఆలస్యమే తొక్కిసలాటకు ముఖ్యకారణమన్నారు. ఈ క్రమంలో కొందరు జనరేటర్‌ ఉన్న గదిలోకి ప్రవేశించి దాన్ని నిలిపివేశారన్నారు. తాగునీటితో సహా సరైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో టీవీకే విఫలమైందని విమర్శించారు.
క్షతగాత్రులకు సాయం చేసేందుకు అత్యవసర సేవల సిబ్బంది ప్రయత్నిస్తుండగా.. టీవీకే కార్యకర్తలు రెండు ఆంబులెన్స్‌లపై దాడి చేశారన్నారు. దాడులకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని స్టాలిన్‌ ప్రస్తావించారు. ఇక, స్టాలిన్‌ మాట్లాడుతుండగా.. ప్రచార ర్యాలీకి అసలు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
 
అయోమయంలో టీవీకే అభిమానులు ?
 
కరూర్‌ తొక్కిసలాట ఘటన… తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్‌ గేమ్‌ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్‌ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. కరూర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్‌ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్‌ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి.
ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్‌ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది.
తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్‌ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్‌ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్‌ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్‌ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.
 
కరూర్‌ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్‌ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్‌ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్‌ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్‌, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్‌ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
The post CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్
  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌
  • వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు
  • అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes