ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. నావికా దళ సిబ్బందిప్రతిభావంతులని… సృజనాత్మకత కలిగిన వారని ప్రశంసించారు. వారు రాసిన ‘కసమ్ సిందూర్‌కి’ (Kasam Sindoor Ki) గీతం ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతుందని అన్నారు.
ఈ పాటలో పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో త్రివిధ దళాలు కలిసి ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులు, ఉగ్రస్థావరాలను సమూలంగా నాశనం చేసిన భారత స్వదేశీ క్షిపణులు వంటి వివిధ విషయాలను ప్రస్తావించారు.
‘విక్రాంత్’పై మోదీ దీపావళి వేడుకలు
గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు.
The post Indian Navy: ఆపరేషన్ సిందూర్‌పై నేవీ ‘కసమ్ సిందూర్‌కి’ పాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
