Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

నమ్మకాన్ని నిజం చేసింది!

Ai generated article, credit to orginal website, October 22, 2025

“క’ మూవీ తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా ద్వారా గొప్ప కథ చెప్పడం లేదు..కేవలం మిమ్మల్ని నవ్వించడమే లక్ష్యంగా సినిమా తీశామని విడుదలకు ముందే చెప్పాం. మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వల్ల తొలిరోజు కాస్త నిరుత్సాహపడినా..ఆ తర్వాత పుంజుకున్నాం. ఇప్పుడు ప్రతీ షో ఫుల్‌ అవుతున్నది.
ఈ సినిమా మా అందరి నమ్మకాన్ని నిజం చేసింది’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా జైన్స్‌ నాని దర్శకత్వంలో రూపొందిన ‘కె-ర్యాంప్‌’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో కిరణ్‌ అబ్బవరం పైవిధంగా స్పందించారు. తమ సంస్థలో అందరూ కలిసి చూసే సినిమాల్నే నిర్మిస్తామని, ‘కె-ర్యాంప్‌’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆకట్టుకుంటున్నదని నిర్మాత రాజేష్‌ దండా అన్నారు. కంటెంట్‌ బాగున్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి ‘కె-ర్యాంప్‌’ విజయమే నిదర్శనమని దర్శకుడు జైన్స్‌ నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీనువైట్ల, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
  • ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్
  • దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
  • పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట
  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes