Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్‌కు ప్రమాదం!

Ai generated article, credit to orginal website, October 23, 2025

ల్యాండింగ్‌ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్‌

తిరువనంతపురం, అక్టోబర్‌ 22: శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం కోసం కేరళకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం కేరళలోని ‘ప్రమదం’ వద్ద హెలికాప్టర్‌ దిగుతుండగా, హెలిప్యాడ్‌ వద్ద నేల కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్‌ టైర్లు అందులో కూరుకుపోయి, ఒకవైపునకు వంగిపోయింది. ఆ సమయంలో రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌లోనే ఉన్నారు.
అయితే, పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. వారంతా కలిసి ఒకవైపునకు ఒరిగిపోయిన హెలికాప్టర్‌ను సరిచేశారు. భద్రతా సిబ్బంది సాయంతో రాష్ట్రపతి హెలికాప్టర్‌ నుంచి కిందికి దిగిన తర్వాత, రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతి ముర్మునే కావడం విశేషం.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes