Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ప్రైవేటు గుప్పిట్లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా

Ai generated article, credit to orginal website, October 23, 2025

సోషల్‌ మీడియా పతనానికి చైర్మన్‌ మన్నె సతీశ్‌ కారణం
ఈ అన్యాయాలను ఇక భరించలేను
టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి వంశీ తీవ్ర ఆరోపణలు
పదవికి రాజీనామా చేస్తూ లేఖ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22(నమస్తే తెలంగాణ): టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి వంశీ సొంత పార్టీ, సొంత సోషల్‌ మీడియాపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్లిందని, సర్వనాశనం అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియా చైర్మన్‌ మన్నె సతీశ్‌ అని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, బయటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగంలో తమకు సరైన గౌరవం దక్కదనే ఉద్దేశంతో సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి చైర్మన్‌ మన్నె సతీశ్‌కు ఘాటు లేఖ రాశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సోషల్‌ మీడియాపై సమావేశం నిర్వహించలేదని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా బలహీనంగా ఉండటంపై గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎన్నికల వరకు కార్యకర్తలు సోషల్‌ మీడియా వారియర్స్‌గా పనిచేశారని, కానీ తర్వాత ప్రైవేటు సైన్యాన్ని దించారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించు కుని, పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes