Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Tuni | తునిలో బాలికపై లైంగికదాడి కేసు.. చెరువులో దూకిన నిందితుడు

Ai generated article, credit to orginal website, October 23, 2025

కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో (Tuni) బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ( Narayanarao) పరారయ్యాడు. బుధవారం అర్ధరాత్రి మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితుడు టీడీపీ నేత కావడం గమనార్హం.
జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలిక పాఠశాలలో (AP Grukula Student) చదవుతున్న బాలికపై (13) నారాయణరావు లైంగికదాడికి పాల్పడ్డాడు. గురుకుల పాఠశాలలో చదువుతున్న మనవరాలి వయసున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి, మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని, ఇంజెక్షన్‌ వేయిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. తుని హంసవరం శివారులోని నిర్మానుష్యంగా ఉన్న ఓ తోటలోకి బాలికను తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడుతున్న సమాయంలో తోట కాపలాదారుడు గమనించి నిలదీయడంతో.. తాను కౌన్సిలర్‌ను అని, మాది వీరవరపుపేట అంటే దబాయించాడు. అయితే అతడు తన ఫోన్‌లో వీడియో తీస్తుండటంతో బాలికను గురుకుల స్కూల్‌లో వదిలేసి కొండవారపేట పారిపోయాడు. విషయం బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకి గల్లంతయ్యాడు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ వెంటనే చెరువులో దూకేశాడని పోలీసులు చెప్పారు. నారాయణరావు కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టామన్నారు. అయితే నారాయణరావు పారిపోవాలని చూశాడా లేదా, అవమానంతో ఆత్మహత్యాయత్నం చేశాడా? తెలియాల్సి ఉంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes