కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
అయితే ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు . నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) సజీవ దహహం అయ్యారు. బెంగళూరులో రమేష్ కుటుంబం స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో వీరు మృతి చేశారు. మృతుల, బాధితుల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళ హైమారెడ్డి… ఆ దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయింది. ‘కళ్ళముందు చూస్తుండగానే బస్సు అంటుకొని దగ్ధం అయింది. ప్రయాణికులు బస్సులోనే సజీవదహనమయ్యారు. శరీరం మొత్తం కాలిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. నేను కార్ లో ఉన్న నా ఫోన్ తెచ్చుకొని పోలీసులకు కాల్ చేద్దామనేలోపే ఈ ఘటన చూసి నిర్ఘాంతపోయాను. భారీ వర్షం పడుతుండగా… వేరే వాళ్ళను ఫోన్ ఆడుదామని అనుకుంటే భారీ వర్షం పడుతుంది’ అని ఆ దృశ్యాలను వివరిస్తూ కంటిపర్యంతమయ్యారు.
16 ఫోరెన్సిక్ బృందాలతో మృతదేహాల గుర్తింపు – హోంమంత్రి అనిత
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోం మంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైనట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయని వెళ్లారు. తీవ్రంగా కలిచివేస్తున్న ఈ ఘటనపై 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పని చేస్తాయన్నారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బస్సులో ఉన్న 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీకి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఆరుగురు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, ఒడిశాలో ఒకరు, బిహార్ లో ఒకరు, ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే కమిటీ కూడా వేస్తామని చెప్పారు.
పోలీసుల అదుపులో ఇద్దరు బస్సు డ్రైవర్లు
బస్సు డ్రైవర్లిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టినట్లు బస్సు డ్రైవర్ చెప్పాడని, అంతకుముందే రోడ్డు ప్రమాదంలో బైక్ పడిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ బైకు పైనుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పాడు. ప్రమాదానికి గల కారాణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది’’ అని ఎస్పీ వివరించారు.
The post Kurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
