Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

లైంగికదాడి.. ఆపై గొంతునొక్కి హత్య

Ai generated article, credit to orginal website, October 26, 2025

మహిళ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు
పోలీసుల అదుపులో నిందితుడు

ఖైరతాబాద్‌ : పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో మహిళ అనుమానస్పద మృతి ఘటనలో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 23న బేగంపే ట గ్రీన్‌ల్యాండ్స్‌ ప్రధాన రహదారిలో అసోంకు చెందిన మహిళ(30) రోడ్డుపై విగతజీవిగా పడి ఉంది. స్థానిక ఓ టీస్టాల్‌ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతపురం జిల్లా నల్లచెర్వు మండలం ఎనమల్లపల్లికి చెందిన వై.రెడ్డప్ప(38) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన రెడ్డప్ప ఆమెను మాటల్లో పెట్టి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టి గొంతునొక్కి హత్య చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes