తెలుగు ప్రేక్షకులకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘జయ జానకీ నాయక’ వంటి సినిమాల ద్వారా బాగా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, పెద్దగా స్టార్ స్థాయికి చేసుకోలేకపోవడం పై ఆమె ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడుతుంటుంది. తాజాగా ధన్య “కృష్ణ లీల” మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె కెరీర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
Also Read : Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్‌గా బాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ..!
ధన్య మాట్లాడుతూ.. “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నేనే. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే కేవలం నటన సరిపోదు, కొన్ని సార్లు గ్లామర్ కూడా అవసరం అవుతుంది. కానీ నేను ఆ దారిని ఎంచుకోలేదు. గ్లామర్ లేదా బోల్డ్ సీన్లను చేయడానికి అంగీకరించలేదు. అందుకే చాలా మంచి అవకాశాలు నా చేయి జారిపోయాయి. మొదట్లో నాకు చాలా బాధ వేసేది, ఎందుకు నేను ఎదగలేకపోతున్నానని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది నేను తీసుకున్న నిర్ణయాలే నా మార్గాన్ని నిర్ణయించాయి. నా కుటుంబం చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగాను. అందుకే నేను చేసే ప్రతి పని ముందు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనే భావనతోనే నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని పాత్రలు తిరస్కరించిన కారణం కూడా అదే. నా కుటుంబ విలువలు, నన్ను నేను గౌరవించుకోవడం ఇవే నాకు ముఖ్యమని నమ్మాను” అని ధన్య చెప్పింది.
అయితే, ఈ నిజాయితీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ, “టాలెంట్ ఉన్న వాళ్ళు గ్లామర్ లేకపోయినా మెరిసిపోవచ్చు” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు, కొందరు ఆమె నిర్ణయాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తన కెరీర్‌లో ఎదురైన కష్టాల గురించి కూడా ధన్య ఓపెన్‌గా మాట్లాడింది. “కొన్ని సార్లు మంచి పాత్రలు వచ్చి కూడా చివరి నిమిషంలో పోయాయి. నేను ఇన్‌డస్ట్రీలో ఎవరికి ఆధారపడకుండా నా దారినే వెతికాను. ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే భవిష్యత్తులో నన్ను కొత్తగా చూపించే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి” అని ధన్య ఆశాభావం వ్యక్తం చేసింది.
