Surekha Vani | ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారారు. తమ సినిమాల అప్డేట్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. నటి సురేఖ వాణి కూడా తన సినిమాల విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.తల్లీకూతుళ్లు సురేఖవాణి – సుప్రీత తాజాగా నడక దారిన మోకాళ్ళ పర్వతంపై మోకాళ్ల మీద మెట్లు ఎక్కి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సురేఖ వాణి, ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు, కూతురు సుప్రితతో కలసి చేసే సరదా హంగామాలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.ఇటీవల సురేఖ వాణి, సుప్రితతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందంలో కూతురికి ఏమాత్రం తీసిపోకుండా సురేఖ వాణి గ్లామర్‌తో మెరిసిపోయింది. తల్లి – కూతురు ఇద్దరూ పోటీపడేలా పోజులు ఇచ్చిన ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వయసుతో పాటు సురేఖ వాణి అందం మరింత పెరుగుతోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే, తల్లి–కూతురు ఇద్దరూ ఒకరిని మించి మరొకరు అందంతో మెరుస్తున్నారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఇక సురేఖా వాణి భర్త సురేష్ తేజ 2019 మే 6 ఆకస్మికంగా కన్నుమూయడంతో సురేఖ మానసికంగా కృంగిపోయారు. భర్త లేకపోవడంతో ఆమె చాలాకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని ప్రచారం జరిగింది. కాని వాటిని సుప్రిత, సురేఖా వాణి కొట్టి పారేశారు.
