మహారాష్ట్ర థానేలో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కే ఫైన్ వేసి కట్టమన్నాడు. దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కంగుతిన్నాడు. ఆ యువకుడికి హెల్మెట్ లేకుండా.. సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడిపినందుకు రెండు వేల రూపాయల ఫైన్ విధించారు. దీంతో ఆ యువకుడు ఆ పోలీసులు నడుపుతున్న బండిని ఆపి వారి వాహనంపై నెంబర్ ప్లేట్ సరిగా లేదని.. చట్టాలు అందరికి సమానమేనని.. ఫైన్ కట్టాలని వారితో వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Chennai: దారుణం.. కొడుకుని చంపి, భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి..
థానే జిల్లాలో వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబికానగర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు ఓ యువకుడికి ఫైన్ వేశారు. అదే సమయంలో యువకుడు ట్రాఫిక్ పోలీసులు నడిపిస్తున్న స్కూటీకి నెంబర్ ప్లేట్ సరిగా లేదని గమనించాడు. ఈ విషయంపై వెంటనే వారిని ప్రశ్నించగా, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు ఆగకుండా వారి వెంటపడి మరీ వాహనాన్ని ఆపి, ‘ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా? పోలీసులకు వర్తించవా?’ అంటూ నిలదీశాడు. దీంతో పోలీసులు ‘ఆ స్కూటీని స్టేషన్‌కు తరలిస్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. కానీ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉండటంతో యువకుడు మరింత గట్టిగా ప్రశ్నించి పోలీసులకు చుక్కలు చూపించారు. ఈ మొత్తం ఘటనను యువకుడు వీడియో తీసీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నెటిజన్‌లు అభినందించారు. నియమాలు అందరికీ సమానంగా ఉండాలి.. పోలీసులే రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా? అని నెటిజన్‌లు నిలదీశారు.
Read Also:Kidney Disease: హెయిర్ డై వాడుతున్నారా.. అయితే జాగ్రత..
అయితే.. ల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి తన చర్యపై పగ పెంచుకున్నాడని, ఆ తర్వాత మళ్లీ ఆ అధికారితో గొడవ పడ్డాడని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అధికారి అదుపులో ఉన్న స్కూటర్ ముందు నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని రైడర్ పేర్కొన్నాడు. వెనుక నంబర్ ప్లేట్ స్పష్టంగా ఉన్నప్పటికీ, ముందు ప్లేట్ స్పష్టంగా లేదని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనంపై చర్య తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వీడియో వైరల్ కావడంతో ఇరువైపులా తగిన చర్యలు తీసుకున్నామని, వీడియో ఆధారంగా తదుపరి విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు.
गंजलेली नंबर प्लेट, पोलीस असल्याचा माज…
गाडी जमा करायची असेल तर वाहतूक पोलिसाची गाडी लागते. जमा करायला चावी कुठून आली? पोलिसांनीच चोरी केली का? गृहमंत्री @Dev_Fadnavis कारवाई होणार का? @mieknathshinde तुमच्या ठाण्यातील घटना आहे असं कळतंय. @ThaneCityPolice @ThaneTraffic #Police pic.twitter.com/97DE9XLGdn
— Harshal Jadhav (@harshal_rj) October 27, 2025
