CM Revanth Reddy : మొంథా తుఫాన్ తెలంగాణ మీద భారీ ప్రభావం చూపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ భారీ వానలు పడుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉంది.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వచ్చాయనేది తెలుసుకుంటారు. సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు.
Read Also : Spirit : అలాంటి పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. నిజమేనా..?
వాగులు, వంకల ఉధృతితో పాటు పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై కూడా సమీక్ష జరపనున్నారు. వరిపంట నష్టం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై కూడా ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రెండు రోజుల దాకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. తెగిపోయిన బ్రిడ్జిలు, విరగిన స్తంభాలు, ధ్వంసమైన రోడ్లపై కూడా ఆరా తీయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీటి రిపేర్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Read Also : Prabhas : క్రేజీ యాక్టర్ ను గుర్తు పట్టలేకపోయిన ప్రభాస్..
