Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Cyclone Montha | వరంగల్‌ జలదిగ్బంధం.. నగరాన్ని ఇంకా వీడని వరద

Ai generated article, credit to orginal website, October 30, 2025

Cyclone Montha | చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్‌ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. సాయిగణేశ్‌ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్‌, ఎన్‌ఎన్‌ నగర్‌, మైసయ్యనగర్‌, సమ్మయ్య నగర్‌లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్‌ తూర్పులో అధికారులు ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని పడవల సహాయంతో పునరావాస శిబిరాలకు తరలించారు. నగరంలోని 12 పునరావాస కేంద్రాలకు 1200 మంది బాధితులను తరలించారు. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్‌, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు వెళ్లే రోడ్డులో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. వర్షాల దృష్ట్యా వరంగల్‌ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్‌, ఇంజినీరింగ్‌, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్‌ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్‌ డీఈవో వెల్లడించారు.
 
 

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా
  • టిడ్కో ఇల్లు రాని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లింపు
  • మహిళా సాధికారతతో సమాజ అభివృద్ధి సాధ్యం
  • సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు
  • 2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes