తెలిసీతెలియని వయసులో కొంత మంది యువతీయుకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు గానీ.. పెద్దలు గానీ తప్పు అని చెబితే మాత్రం పగ పెంచుకుంటున్నారు. చివరికి కన్నపేగు బంధాన్ని కూడా తెంచుకోవడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి దారుణమే టెక్ సిటీలో వెలుగుచూసింది. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి కన్నతల్లినే హతమార్చింది ఓ బాలిక. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది.
ఇది కూడా చదవండి: Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ
బెంగళూరులోని ఉత్తరహళ్లిలో నేత్రావతి (35) అనే మహిళ నివాసం ఉంటుంది. లోన్ రికవరీ సంస్థలో హెల్పర్‌గా పని చేస్తోంది. నేత్రావతికి 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ మధ్య ఒక యువకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కుమార్తె ప్రవర్తనను కనిపెట్టిన నేత్రావతి మందలించింది. స్నేహితులతో బయట తిరగొద్దని సూచించింది. ఈ మాటే కుమార్తెకు కోపం తెప్పించింది. స్నేహితుడితో తిరగకుండా తన తల్లి కట్టడి చేస్తోందని పగ పెంచుకుంది. ఒకరోజున ఇంట్లో యువకుడితో కుమార్తె ఏకాంతంగా ఉండటాన్ని నేత్రావతి చూసింది. దీంతో తల్లిలో కోపం చెలరేగి బిడ్డపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తమ బంధానికి తల్లి అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి హత్యకు కుట్రపన్నింది. అక్టోబర్ 25న అదునుచూసి బాలిక, ప్రియుడు, మరో నలుగురు మగ స్నేహితులతో కలిసి నేత్రావతి గొంతు కోసి చంపేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫ్యాన్‌కు చీరతో వేలాడదీసి పారిపోయారు.
ఇది కూడా చదవండి: Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? ఓటర్ల మైండ్ సెట్ ఈసారి ఎలా ఉండబోతుంది?
అయితే నేత్రావతి సోదరి ఇంటికి వచ్చి చూడగా చనిపోయి ఉంది. ఇంట్లో కుమార్తె కూడా కనిపించకుండా పోవడంతో ఏదో జరిగిందన్న అనుమానంతో సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా హత్యగా తేల్చారు. దర్యాప్తులో నేత్రావతిని టవల్‌తో గొంతుకోసి చంపినట్లుగా తేలిందని.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాదదీశారని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
తరచుగా ఇంటికి వస్తున్న అబ్బాయితో సంబంధం మానుకోవాలని కుమార్తెను హెచ్చరించడంతోనే నేత్రావతిని బాలిక, ఆమె స్నేహితులు చంపేశారని పోలీసులు తెలిపారు. బాలికకు చెందిన ఒక బంధువు ద్వారానే ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. హత్యలో కుమార్తె కూడా పాల్గొందని.. ఇంట్లో ప్రియుడితో ఉండగా పట్టుబడడంతో హత్యకు ప్లాన్ చేశారని వివరించారు. నిందితులంతా మైనర్లేనని.. బాలికతో సహా ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేసి.. జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu Serious: ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారంపై చంద్రబాబు అసహనం.. కీలక ఆదేశాలు
