UK: లండన్‌లో కత్తిదాడులు కలకలం రేపాయి. లండన్‌కు వెళ్తున్న రైలులో ఇద్దరు అనుమానితులు అనేక మంది ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. యూకే పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. శనివారం ఈ సంఘటన జరిగింది. గాయపడిన చాలా మందిని ఆస్పత్రికి తరలించారు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని తూర్పు గ్రామీణ పట్టణం హంటింగ్‌డన్‌లో దాడి గురించి సమాచారం రావడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత పోలీసులు రైలును చుట్టుముట్టారు. ఈ రైలు ఈశాన్య పట్టణమైన డాన్‌కాస్టర్ నుంచి లండన్ లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ వరకు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తరుచుగా ఈ రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
గాయపడిన, ఆస్పత్రికి తరలించిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. బ్రిటిష్ మీడియా చెబుతున్న దాని ప్రకారం, 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఇంటీరియర్ మినిస్టర్ షబానా మహమూర్ ధ్రువీకరించారు. అధికార డేటా ప్రకారం, ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో వరసగా కత్తి దాడులకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి. బ్రిటన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు కలిగి ఉన్నప్పటికీ, ఈ కత్తి దాడులు పెరుగడంపై ప్రధాని స్టార్మర్ ‘‘జాతీయ సంక్షోభం’’గా ముద్ర వేశారు. 
