ప్రియురాలి కోసం అధికారిక జెట్‌ను ఉపయోగించడంపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. షట్‌డౌన్ కారణంగా జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేసేందుకు జెట్‌లో తిరుగుతున్నారంటూ వివాదం జరిగింది.
తాజాగా ఇదే అంశంపై కాష్ పటేల్ వివరణ ఇచ్చారు. తన స్నేహితురాలు అలెక్సిస్ విల్కిన్స్ నిజమైన దేశ భక్తురాలు అని.. జెట్ ఉపయోగించడంపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారంటూ తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. ఏడుగురు మృతి
కాష్ పటేల్.. తన ప్రియురాలిని సమర్థిస్తూ కీలక పోస్ట్ చేశారు. ‘‘మీరు నన్ను ఎంత కావాలంటే అంతగా విమర్శించండి. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని లేదా నా చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం పూర్తిగా అవమానకరం.’’ అని అన్నారు. అయితే జెట్ విమాన వివరాలను బయటపెట్టిన వారి పట్ల కాష్ పటేల్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ (45), 26 ఏళ్ల అలెక్సిస్ విల్కిన్స్ ఇద్దరూ ప్రేమికులు. పెన్సిల్వేనియాలో రెజ్లింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ సంగీత కచేరీ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ అధికారిక జెట్‌ను ఉపయోగించారు. వర్జీనియా నుంచి పెన్సిల్వేనియాకు 40 నిమిషాల విమాన ప్రయాణం చేసి ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందుకోసం 60 మిలియన్ల వరకు ఖర్చైంది.
ఇది కూడా చదవండి: Road Accident: చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టి బోల్తా పడిన టిప్పర్..!
అయితే ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ కీలక ఆరోపణలు చేశారు. ప్రియురాలి కోసం కాష్ పటేల్ అధికారిక జెట్‌ను ఉపయోగించారని.. దేశమంతా షట్‌డౌన్‌లో ఉండి.. జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం మన డబ్బులతో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కిపెట్టాడు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో తాజాగా కాష్ పటేల్ సమర్థించారు.
వాస్తవంగా ఉన్నత పదవులో ఉన్నవాళ్లు అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే.. అందుకు అయిన ఖర్చు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కాష్ పటేల్ ఇలా అనధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక ప్రైవేటు కార్యక్రమాలకు అధికారిక జెట్‌ను ఉపయోగించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
అలెక్సిస్ విల్కిన్స్ ఒక సింగర్, రచయిత్రి, వ్యాఖ్యాత, ప్రెస్ సెక్రటరీగా కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లో బాల్యాన్ని గడిపారు బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం, రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. 2022లో ఒక కార్యక్రమంలో కాష్ పటేల్-విల్కిన్స్ కలుసుకున్నారు. 2023 నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.
