చెన్నైలోని కోయంబత్తూరు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్న ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరిపి.. ఆపై అరెస్ట్ చేశారు. శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ లు నిన్న కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న ఇద్దరు యువతి యువకులపై దాడి చేశారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
Read Also: Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని ఎయిర్ పోర్ట్ సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న యువతి, యువకులపై దాడికి తెగబడ్డారు శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ అనే నిందితులు. అనంతరం యువతిని లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. తెల్లవారుజామున ఓ ఆలయ సమీపంలో దాక్కున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసలపై నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే ఎదురు దాడిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులను కాళ్లపై కాల్చారు పోలీసులు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఇప్పటికే హత్య, దోపిడీ, దాడితో సహా ఇప్పటికే 5 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
