Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బై ఎలక్షన్ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌లో క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కలిపిస్తారు.. ఇక, ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది ఉన్నారు…. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. 1,761 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.. 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు.. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు & డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు.. మరోవైపు ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు…
