Bihar Elections Live Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసానుంది.. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ఈరోజు మలి విడతలో 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం విదితమే.. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి.. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..
