Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Cabinet Meeting | నేడు బీహార్‌ క్యాబినెట్‌ చివరి సమావేశం.. గవర్నర్‌ను కలువనున్న సీఎం నితీశ్‌

Ai generated article, credit to orginal website, November 17, 2025

పాట్నా: బీహార్‌లో (Bihar) రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్‌ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్‌ (Cabinet Meeting) చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం నితీశ్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 11.30 గంటలకు భేటీ కానుంది. మంత్రి మండలి రద్దుపై నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన పూర్తి అధికారాన్ని ముఖ్యమంత్రికి కట్టబెడుతూ తీర్మాణం చేయనుంది. అనంతరం సీఎం నితీశ్‌ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను కలిసి తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరనున్నారు. ఇటీల ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వినోద్‌ సింగ్‌ గుజియాల్‌ గవర్నర్‌కు ఆరిఫ్‌కు ఆదివారం సమర్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రిమండలి సమావేశం కానుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఇప్పటికే క్యాబినెట్‌ కూర్పుపై కూడా తుది నిర్ణయం జరిగిపోయినట్టు రాజకీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం బీజేపీకే అధిక సీట్లు వచ్చినా, ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమారే మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. బీజేపీ, ఎల్జేపీలకు ఒక్కో డిప్యూటీ సీఎం పోస్ట్‌ దక్కే అవకాశాలున్నాయి. ‘ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి’ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీజేపీ-జేడీ(యూ)లు టికెట్లు పంచుకున్న శాతంలోనే మంత్రి పదవులను పొందడానికి అంగీకరించాయి. దీని ప్రకారం మంత్రివర్గంలో బీజేపీకి 15-16 స్థానాలు, జేడీ(యూ)కు 14, ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌)కి మూడు, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎస్‌పీ పార్టీలకు తలో మంత్రి పదవిని కేటాయించనున్నారు.
సీఎం పదవిని నితీశ్‌కే ఇవ్వాలని బీజేపీ నిర్ణయించడంతో మహారాష్ట్రలో మాదిరిగా అధికారంపై కూటమిలో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఇంచుమించు లేవు. ప్రధాని మోదీ అందుబాటును బట్టి కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ షెడ్యూలు బుధవారం లేదా గురువారం ఉండవచ్చు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయాన్ని దక్కించుకుంది. బీజేపీకి 89, నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌)కి 19, హెచ్‌ఏఎం 5 , ఆర్‌ఎల్‌ఎస్‌పీ 4 సీట్లలో విజయం సాధించడంతో మరోసారి బీహార్‌లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడానికి సిద్ధమైంది. కూటమి పార్టీల అంతర్గత చర్చల అనంతరం సంయుక్త లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం నిర్వహించాలని, అందులో కూటమి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఆ వ్యక్తే బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాం
  • రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి
  • ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
  • సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్
  • టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes