Panchayat Elections Live Updates: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. చివరి విడత.. 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 116 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డుల పోలింగ్‌పై కోర్టు స్టే విధించడంతో మిగిలిన 28,410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. 75,725 అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ఎన్టీవీ లైవ్ అప్డెట్స్ మీకోసం..
