Hyderabad | హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామును సినిమా షూటింగ్‌కు వెళ్లొస్తున్న బస్సు.. ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ మణికొండకు వస్తుండగా పెద్ద అంబర్‌పేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై బస్సు (TS13FB3649) బిగ్ పిక్చర్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
