ముంబై : వరల్డ్ టాప్ క్లాస్ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ప్రముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీలక ప్రకటన చేసింది. తనను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ ను నియమించినట్లు తెలిపింది. టెక్నో పెయింట్స్ 2026-27 నాటికి తన ఐపీఓ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ప్లేయర్ గా తనకు పేరుంది. తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వెనుక భారీ మార్కెట్ స్ట్రాటజీ దాగి ఉందని తేలి పోయింది. ఇప్పటికే భారీ ఎత్తున ఆస్తులను పోగేశాడు సచిన్ రమేష్ టెండూల్కర్. తను ముందు నుంచి భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం, పెట్టుబడులు పెడుతూ వచ్చాడు.
ఇదే సమయంలో తనతో పాటు ఆడిన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ క్రికెటర్ వినోద్ కాంబ్లి మాత్రం చెడు అలవాట్ల కారణంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెల నెలా పెన్షన్ తోనే బతుకుతున్నాడు. ఆ మధ్యన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉన్న సమయంలో కొంత సాయం చేశాడు సచిన్ టెండూల్కర్. ఇదిలా ఉండగా పెయింట్స్ తయారీ సంస్థ మూడు సంవత్సరాల పాటు తమ కంపెనీకి రాయబారిగా ఉంటారని తెలిపింది. కాగా గత 25 సంవత్సరాల పాటు పెయింట్స్ రంగంలో స్థిరమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీని కారణంగా మరింతగా ఆదాయాన్ని పెంచుకునే దిశగా పావులు కదిపింది. ఈ మేరకు సచిన్ తో ఒప్పందం ఖరారు చేసుకుంది.
The post టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
