కేరళ : శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. ఈసారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దారి పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. లక్షలాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా మకర జ్యోతిని దర్శించుకున్నారు. తమ జీవితం ధన్యమైందని భావించారు. కొన్ని నెలలుగా అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులు నేటి మకర జ్యోతి దర్శనంతో పూర్తి చేసుకుంటారు. తిరిగి ప్రయాణం అవుతారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా మకర జ్యోతి అనేది కీలకం అయ్యప్ప భక్తులకు. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు సాయంత్రం వేళ ఆకాశంలో దివ్య జ్యోతి కనిపిస్తుంది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వయంగా జ్యోతి రూపంలో భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇక హిందువులు జరిపే ముఖ్యమైన ఫెస్టివల్స్ లలో సంక్రాంతి ఒకటి. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అదృష్టం ఉంటేనే కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఈ దివ్య జ్యోతి దర్శనం కలగదని భావిస్తారు. ఈ అపురూపమైన దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శబరిమలలో పోటెత్తిన భక్తులను కంట్రోల్ చేసేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
The post పోటెత్తిన భక్తజనం మకర జ్యోతి దర్శనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
