Allu Arjun | టోక్యోలో నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్ అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ జపనీస్‌లో ‘పుష్ప’ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది. అభిమానులు విజిల్స్‌తో హాల్‌ను ఉర్రూతలూగించగా, ఆ వాతావరణం పండుగను తలపించింది. ప్రీమియర్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. జపాన్ ప్రేక్షకులు భారతీయ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో ఈ స్పందన మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా మాస్ యాక్షన్, స్టైలిష్ హీరోయిజం అక్కడి ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో జనవరి 16న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీమియర్ ఈవెంట్‌కి లభించిన స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. జపాన్‌లో ఈ చిత్రాన్ని ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల సహకారంతో దాదాపు 250 థియేటర్లలో సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక భారతీయ కమర్షియల్ సినిమా ఇంత పెద్ద స్థాయిలో జపాన్‌లో రిలీజ్ కావడం విశేషంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ జపాన్ వెళ్లగా, ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా అక్కడే ఉన్నారు. విమానాశ్రయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరి వారిని ఘనంగా స్వాగతించడం విశేషం. ఇది ‘పుష్ప’ సిరీస్‌కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
ఇప్పటికే ‘పుష్ప 2: ది రూల్’ భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలో భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ నటన, స్టైలిష్ లుక్, పాటలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణే నటించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Konnichiwa, Japan
Icon Star @alluarjun stuns the audience by delivering his #Pushpa2 Japanese dialogue at the Tokyo premiere
Receiving huge cheers and thunderous applause from the crowd
Grand release in Japan on January 16th #Pushpa2#WildFirePushpa… pic.twitter.com/dm5kEECMT7
— Pushpa (@PushpaMovie) January 15, 2026
