చెన్నై : ఆస్కార్ అవార్డు విన్నర్ , మ్యూజిక్ లెజండ్ అల్లా రఖా రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళం, హిందీ , తెలుగు భాషలలో పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ సందర్భంగా తను సంగీతం అందించిన తొలి చిత్రం రోజా. దీనిని మణిరత్నం తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి దాకా సంగీత సామ్రాట్ గా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మాస్ట్రో ఇళయరాజాను వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. స్లమ్ డాగ్ మూవీకి ఆస్కార్ అవార్డు పొందాడు. ఇక లగాన్ , తాళ్ మూవీస్ తో బాలీవుడ్ లో శిఖరాగ్రానికి చేరుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా తాను బాలీవుడ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ప్రధానంగా తొలిసారి తను దక్షిణాది, ఉత్తరాది గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం తను చేసిన కామెంట్స్ భారతీయ సినిమా రంగంలో మరో చర్చకు దారి తీసేలా చేశాయి.
ఈ సందర్బంగా రెహమాన్ దక్షిణాది కళాకారులు ఎదుర్కొంటున్న సాంస్కృతిక, భాషా సవాళ్లను కూడా రెహమాన్ ప్రస్తావించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా తాల్ విడుదలయ్యే వరకు తాను తరచుగా హిందీ చిత్ర పరిశ్రమలో బయటి వ్యక్తిలా భావించేవాడినని పేర్కొన్నాడు. మొదట్లో తనకు ఎటువంటి మినహాయింపు అనిపించ లేదన్నాడు. దాని గురించి ఎప్పుడూ తెలుసుకోలేక పోయానని తెలిపాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా తను బాలీవుడ్ కు సంగీతం అందించినట్లు చెప్పాడు రెహమాన్. ప్రస్తుతం తాను సంగీతంపై ఫోకస్ పెట్టానని అన్నాడు. తాజాగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాహ్నవి కపూర్ కలిసి నటిస్తున్న పెద్ది మూవీకి సంగీతం అందించాడు. ఇందులో తను స్వర పరిచిన చికిరి చికిరి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
The post బాలీవుడ్ పై ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
