హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడిగా పేరు పొందిన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. శుక్రవారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి తన కెరీర్ లో తొలిసారిగా తెలుగు సినిమాలో హీరోగా చేస్తుండడం విశేషం. స్లమ్ డాగ్ అని టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు పూరీ జగన్నాథ్. మురికివాడల నుండి ఎవరూ ఆపలేని తుఫాను ఒకటి ఉద్భవిస్తుంది అంటూ ఓ అందమైన క్యాప్షన్ కూడా జోడించాడు దర్శకుడు. స్వతహాగా భావుకుడు, రచయితగా , దర్శకుడిగా, ఆలోచనా పరుడిగా గుర్తింపు పొందాడు.
ఇప్పటికే టాప్ హీరోస్ తో పని చేసిన అనుభవం ఉంది పూరీ జగన్నాథ్ కు. ప్రత్యేకించి సినిమా టైటిళ్లు డిఫరెంట్ గా ఉంటాయి. తన దర్శకత్వంలో ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రభాస్ , విజయ్ దేవరకొండతో తీశాడు. తాజాగా సేతుపతితో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడైన విజయ్ తో జతకట్టారు. మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు అధికారికంగా టైటిల్‌ను కూడా ప్రకటించడం విశేషం. విజయ్ సేతుపతి రక్తంతో తడిసిన ఆయుధాన్ని పట్టుకుని ఉన్న పోస్టర్ లుక్ అదిరేలా ఉంది. ఇప్పటి దాకా చేసిన పాత్రలకంటే మరింత భిన్నమైన పాత్రకు ఎంపిక చేశాడు దర్శకుడు.
The post పూరీ జగన్నాథ్ సేతుపతి మూవీ టైటిల్ ఖరారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
