Street Dogs | యాచారం, జనవరి 20: రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెందాయని, ఇది చట్టరీత్యా నేరమని కొందరు కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీకి చెందిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన నలుగురు ప్రతినిధులు మంగళవారం యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు.
యాచారంలో ఆదివారం కొందరు కుక్కలకు పట్టుకునే క్రమంలో విషప్రయోగం చేయడం వల్లే అవి మృతి చెందినట్టు సదరు ఫౌండేషన్ సంస్థ వారు పేర్కొన్నారు. దాదాపు 80 కుక్కలను చంపినట్టు వారు ఆరోపించారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన పోలీసులు.. పంచాయతీ కార్యదర్శి కిషన్‌నాయక్‌ను పిలిచి కుక్కల పట్టివేత అంశంపై ఆరా తీశారు. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సూచించారు.
st
ఆర్టీఐ చట్టం ద్వారా వైద్యారోగ్య శాఖ వెల్లడి
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత ఐదేండ్లుగా దాదాపు 15 లక్షల మంది కుక్కకాట్లకు, 21 వేల మందికిపైగా పాముకాట్లకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2020 జూలై నుంచి 2025 వరకు 14,88,781 మంది కుక్కకాట్లకు గురయ్యారని, ఆ బాధితులకు విడతలవారీగా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని తెలిపింది. సమాచార హక్కు (ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను తెలియజేసినట్టు యాత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మీడియాకు వెల్లడించారు.
