Mahindra Scorpio N Facelift: మహీంద్రా ఇటీవలే XUV 7XOను విడుదల చేసింది. ఇప్పుడు తన అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీలలో ఒకటైన స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌పై దృష్టి పెట్టింది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో కేమోఫ్లాజ్తో ఉన్న స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ కనిపించింది. ఆ కారు వివరాల ఆధారంగా ఈ మోడల్ ఇప్పటికే ఉత్పత్తి దశకు చాలా దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది. బయటి రూపం, అంతర్గత ఫీచర్లలో మార్పులతో మరింత ఆధునికంగా రూపుదిద్దుకుంటుంది. ఈ స్కార్పియో Nకు ప్రత్యేకమైన రగ్గడ్ క్యారెక్టర్‌ను కొనసాగించనుంది.
Read Also: Atlee : దీపికా పడుకునే నా అదృష్ట దేవత : డైరెక్టర్ అట్లీ
డిజైన్ లో స్వల్ప మార్పులు
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుత డిజైన్ లాంగ్వేజ్‌కు పెద్దగా మార్పు లేదు. నిలువైన స్టాన్స్, బలమైన ప్రపోర్షన్స్ యథాతథంగా కొనసాగుతున్నాయి. డ్యూయల్-పాడ్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, C-షేప్ సిల్వర్ సర్రౌండ్స్తో ఉన్న LED ఫాగ్ ల్యాంప్స్ ముందుభాగాన్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే, గ్రిల్‌ను స్వల్పంగా రీడిజైన్ చేయడంతో ముందు భాగం మరింత షార్ప్‌గా కనిపిస్తోంది. బంపర్ అంచులు గతంతో పోలిస్తే ఇప్పుడు స్మూత్‌గా ఉండటం గమనార్హం. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేవు.. అలాగే, విండో లైన్, పుల్-టైప్ డోర్ హ్యాండిల్స్ కొనసాగుతున్నాయి. 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌కు కొత్త స్పోక్ డిజైన్ ఇవ్వడంతో లుక్కు స్వల్పంగా మోడర్న్ టచ్ వచ్చింది.
Read Also: Municipal Elections Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!
భారీ అప్డేట్స్
స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో ముఖ్యమైన మార్పులు క్యాబిన్లో కనిపించనున్నాయి. పాత 8-ఇంచ్ యూనిట్ స్థానంలో ఫ్లోటింగ్ 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందిస్తున్నారు. అలాగే, అనలాగ్ డయల్స్‌కు బదులుగా 10.25-ఇంచ్ ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే రానుంది. ఇవి క్యాబిన్‌కు మరింత ప్రీమియం ఫీల్‌ను తీసుకువస్తాయి. ఇవే, కాకుండా హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ (డాల్బీ ఆట్మాస్‌తో), పానోరామిక్ సన్‌రూఫ్, రెండో వరుస సీట్లకు వెంటిలేషన్, డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్, 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న కీ లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, వైర్లెస్ ఛార్జింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు కొనసాగనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Visakhapatnam: భర్త వదిలేశాడనే కోపం.. ఆటోలో పసికందును వదిలేసిన తల్లి
ఇంజిన్ & మెకానికల్స్
మెకానికల్‌గా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో మార్పులు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లనే కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉండనున్నాయి. డీజిల్ వేరియంట్లో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్ కొనసాగనుంది. అయితే, పరీక్షించబడిన పవర్ ట్రెయిన్లకు ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు జోడించడంతో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కొనుగోలుదార్లను కూడా ఆకర్షించనుందని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు.
