కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహారాష్ట్రలో చోటు చేసుకున్న విమానం కూలి పోయిన ఘటనలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరికొందరు దుర్మరణం చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీదీ. ఈ సందర్బంగా ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ కు ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా అజిత్ పవార్ ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని మమతా బెనర్జీ కోరారు. ఇతర ఏజెన్సీలన్నీ పూర్తిగా రాజీ పడ్డాయని ఆరోపించారు. ప్రస్తుత యంత్రాంగాల ద్వారా నిజం బయట పడదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు మాత్రమే విశ్వసనీయంగా ఉంటుందని నొక్కి చెప్పారు.
మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఆమె డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. కోల్‌కతాలో మాట్లాడుతూ, నిజం ఇప్పటికే ఉన్న యంత్రాంగాల ద్వారా బయట పడదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు మాత్రమే విశ్వసనీయంగా ఉంటుందని దీదీ స్పష్టం చేశారు. అజిత్ పవార్ తన మామ శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం లోకి తిరిగి రావాలని యోచిస్తున్నారని బెనర్జీ సూచించారు, ఇటీవలి రోజుల్లో వెలువడిన నివేదికలు అలాంటి చర్యను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఇవాళ తన మరణవార్త విని నేను షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు.
The post అజిత్ పవార్ దుర్మరణం అనుమానాస్పదం : దీదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
