అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక రైల్వే సమస్యలపై చర్చించారు. పిఠాపురంకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని ఉదహరించారు. ఈ సందర్బంగా పిఠాపురం రైల్వే స్టేషన్ ను ఆదర్శవంతమైన కేంద్రంగా అభివృద్ది చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం న్యూఢిల్లీలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక రైల్వే సమస్యలపై చర్చించారు.
ప్రయాణికులకు, యాత్రికులకు ఆధునిక సౌకర్యాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలను అందించడానికి పిఠాపురం స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద చేర్చాలని ఆయన అభ్యర్థించారు. కుప్పం సమీపంలోని కంగుండిని రేపు ఏపీ మొదటి వారసత్వ గ్రామంగా ప్రకటించడం పట్ల కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రిని సేతు బంధన్ పథకం కింద మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జిని పీఎం గతి శక్తి ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కూడా కోరారు. ఇది లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, జాతీయ రైల్వే ప్రణాళిక–2030కి అనుగుణంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. వాటిని వెంటన పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి.
The post పిఠాపురంకు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
