హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది. ఇందులో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కీలక పదవులలో ఉన్న ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ మేనల్లుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావులను విచారించింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులను పదేపదే విచారించగా కేటీఆర్, హరీష్ లను ఒక్కొక్కరిని ఏడు గంటలకు పైగా విచారించారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. వయసు మీద పడడంతో తనకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు నోటీసులో పేర్కొంది.
తను నేరుగా సిట్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే సయమంలో వయసు రీత్యా తను కోరుకున్న చోటులో విచారణ చేపడతామని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి కేసీఆర్ కు నోటీసు ఇవ్వడంపై. మరో వైపు ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఒకవేళ కేసీఆర్ గనుక స్వంతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు గనుక హాజరు అయినట్లయితే తన క్యాడర్ ను , అభిమానులను తట్టుకోవడం కష్టం. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం తలకు మించిన భారం అవుతుంది. అందుకేనేమో కేసీఆర్ కూడా తాను స్వయంగా విచారణకు హాజరు కాలేనని, తన ఫామ్ హౌజ్ కు వచ్చి విచారించాలని కోరారు.
The post ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
