ముంబై : భారత క్రికెట్ పేసర్ సందీప్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. అందరూ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కానీ తన కెరీర్ లో గొప్ప ప్లేయర్ అని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా తనకు బేషరతుగా మద్దతు ఇచ్చిన విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2023 వేలంలో నేను అమ్ముడు పోనప్పుడు, నా కెరీర్‌లో అత్యంత కష్టకాలంలో ఉన్నానని తెలిపాడు. సరిగ్గా అప్పుడే సంజు శాంసన్ నాకు ఫోన్ చేశాడని అన్నాడు. ఆ సమయం లో చాలా నిరాశగా ఉన్నప్పుడు, అతను ఎంతో సానుకూలంగా మాట్లాడాడని చెప్పాడు సందీప్ శర్మ.
నేను అమ్ముడు పోక పోవడం చూసి తనకు నిజంగా బాధ కలిగిందని చెప్పాడు . మరో వైపు గాయాలు ఆటలో భాగమేనని నాకు గుర్తు చేశాడని తెలిపాడు. తాను ఈ ఐపీఎల్‌లో ఆడతానని, బాగా రాణిస్తానని సంజూ శాంసన్ తనకు హామీ ఇచ్చాడని పేర్కొన్నాడు సందీప్ శర్మ. ఆ సమయంలో భారీ నమ్మకంతో నన్ను పలకరించిన ఏకైక వ్యక్తి శాంసన్ మాత్రమేనని , ఇంకే ఏ ఆటగాడు తనను పలకరించలేదని వాపోయాడు. కేవలం పైపై మాటల ప్రోత్సాహం కాదు, అతను చెప్పిన ప్రతి మాటను మనస్ఫూర్తిగా ఆచరణలో పెట్టాడన్నారు. కష్టకాలంలో తోడుగా నిలబడే నిజమైన స్నేహితుడు ఎలాంటివాడో అప్పుడు నాకు తెలిసిందని చెప్పాడు సందీప్ శర్మ. ఆ వెంటనే తను నన్ను రాజస్తాన్ రాయల్స్ క్యాంప్ కు పిలిపించాడని, ప్రసిద్ద్ క్రిష్ణ గాయపడడంతో నాకు ఛాన్స్ దక్కిందన్నాడు .
The post సంజూ శాంసన్ సహకారం మరిచి పోలేను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
