హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కాలేజీల్లోని అర్హులైన అధ్యాపకులకు గైడ్‌షిప్ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకుల సంఘం కోరింది. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈ బ్రిజేష్ మాట్లాడుతూ ఓయూలో రీసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఉందని, అభిరుచి గల డిగ్రీ అధ్యాపకులకు గైడ్‌షిప్ అవకాశం కల్పించాలని కోరారు. కేయూ, శాతవాహన యూనివర్సిటీలు ఈ దిశలో అడుగులేశాయని, ఓయూలోనూ అవకాశం కల్పించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ శ్రీనివాస్‌గౌడ్, మహిళా కార్యదర్శి డాక్టర్ భవాని, ఓయూ కార్యదర్శి డాక్టర్ సీహెచ్ రాకేష్‌భవాని, డాక్టర్ సుభాష్‌రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
టీచర్ల ఆత్మగౌరవం పెంచిన సంఘం పీఆర్టీయూటీఎస్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : ఎన్నో చారిత్రక జీవోలు సాధించి, టీచర్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సంఘం పీఆర్టీయూ టీఎస్ అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కొనియాడారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీపాల్‌రెడ్డి సంఘం వ్యవస్థాపకులైన సామల యాదగిరి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని శ్రీపాల్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
