హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి స్పందించాడు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెలలోనే ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా తో కలిసి విజయ్ దేవరకొండ ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో సినీ, వ్యాపార, వాణిజ్య, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా ముందు నుంచీ విజయ్ దేవరకొండతో మంచి స్నేహం కలిగి ఉన్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లి వార్తలపై తన స్పందన తెలియ చేశాడు. ప్రస్తుతం దేవరకొండ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం రౌడీ జనార్దన్ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో కీలక పాత్ర పోషించింది అందాల తార భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ, తరుణ్ బాస్కర్ మధ్య బలమైన బంధం ఉంది. తను దర్శకత్వం వహించిన చిత్రం పెళ్లి చూపులులో ముఖ్య పాత్ర పోషించాడు విజయ్ దేవరకొండ. ఇది 2016లో వచ్చింది.
ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ దుమ్ము రేపింది. భారీ కలెక్షన్స్ కురిపించింది. దీనిని హిందీ లో కూడా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వారి తొలి హిట్ తర్వాత ఈ ఇద్దరూ వృత్తిపరంగా కలిసి పని చేయక పోయినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. దీనిపై స్పందించమని కోరగా తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు విజయ్ నుంచి ఆహ్వానం అందలేదన్నాడు.
The post ‘రౌడీ’ నుంచి ఆహ్వానం అందలేదు : తరుణ్ భాస్కర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
