హైదరాబాద్ : భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ముహూర్తం షాట్ కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఇంద్రజ మాట్లాడారు. స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెర కెక్కిస్తున్నారని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించ బోతున్నాం అన్నారు. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించ బోతున్నానని చెప్పారు. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం అన్నారు. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా నిర్మిస్తున్నారని, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని అన్నారు.
హీరో జైశ్వర్ మాట్లాడుతూ విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నానని తెలిపారు. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచి పోతుందని చెప్పారు . హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. దర్శకుడు ఎస్ నాగరాజు రావు మాట్లాడుతూ ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటిష్ కాలం నాటి హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో ఇంద్రజ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారో, ఆ పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు.
The post ‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
