శ్రీలంక : టి 20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో అమెరికా జట్టుపై విజయం సాధించింది పాకిస్తాన్. పాక్ జట్టుకు చెందిన ఫర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లు కూడా స్పిన్ మాయజాలం చేయడంతో పాక్ సునాయసంగా గెలుపొందింది. ఈ రెండు జట్లు గ్రూప్ – ఎలో తలపడ్డాయి. ఫర్హాన్ 41 బంతులు ఎదుర్కొని 73 రన్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది. అబ్రార్ అహ్మద్ 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా . షాదాబ్ ఖాన్ 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఉస్మాన్ తారిక్ 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
నవాజ్ 21 రన్స్ ఇచ్చి మరో వికెట్ కూల్చాడు. అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది అమెరికా జట్టు. 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితం అయ్యింది అమెరికా జట్టు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ టీమ్ కు ఇది రెండో విజయం టోర్నీలో. ఇక అమెరికా జట్టు గెలుపు కు దగ్గరగా వచ్చింది. శుభమ్ రంజానే దూకుడుగా ఆడాడు. తను కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. ఓపెనర్లు షయాన్ జహంగీర్ 34 బాల్స్ ఎదుర్కొని 49 పరుగుల వద్ద వెనుదిరిగాడు. గౌస్ 13 బాల్స్ ఎదుర్కొని 13 రన్స్ చేశాడు. చివరకు పాకిస్తాన్ బౌలర్ల మాయాజాలానికి వికెట్లు పారేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
The post ఎట్టకేలకు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
