TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డెట్స్ మీకోసం..
